ప్రతి వంట గదిలోనూ ఎల్పీజీ సిలెండర్ ఉండాలనే లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది. శుక్రవారం నాడు మంజూరు చేసిన గ్యాస్ కనెక్షన్లతో ఇప్పటి వరకు మంజూరు చేసిన ఎల్పీజీ సిలెండర్ల సంఖ్య 7 కోట్లకు చేరుకుంది.
చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గడిచిన 34 నెలల కాలంలో 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం' కింద 7 కోట్లు కనెక్షన్లు జారీ చేశామని , రోజుకు సగటున 69 వేల ఎల్పీజీ సిలెండర్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
"2016, మే 1 లో ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2019 మార్చి నాటికి కనీసం 5 కోట్ల మందికి సిలెండర్లు అందించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాం. తర్వాత 2021 నాటికి 8 కోట్ల మందికి ఎల్పీజీ మంజూరు చేయాలని చూస్తున్నాం."- ధర్మేంద్ర ప్రదాన్, చమురు శాఖ మంత్రి