తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్ వేళ విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం!

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్త లాక్​డౌన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లుల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించనున్నట్లు సమాచారం. ఈ ఉపశమన చర్యలతో పాటు 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్​కే సింగ్ వెల్లడించారు.

lockdown electricity
లాక్​డౌన్ వేళ విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం!

By

Published : Mar 28, 2020, 12:15 PM IST

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్. విద్యుత్ రంగానికి సంబంధించి పలు సహాయక చర్యలకు ఆయన ఆమోదముద్ర వేశారు. లాక్​డౌన్ కాలంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేయడానికి తమ శాఖ కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు లాక్​డౌన్ కాలంలో విద్యుత్​శాఖ తీసుకునే చర్యలపై ప్రకటన విడుదల చేశారు. తమ మార్గదర్శకాలను రాష్ట్రాల్లోని విద్యుత్ నియంత్రణ సంస్థలు అమలు చేయాలని సూచించారు.

విద్యుత్ ఉత్పత్తిలో 70% బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచే జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ బొగ్గు కంపెనీల ద్వారా బొగ్గు ఉత్పత్తి, రైల్వేల ద్వారా రవాణాను కొనసాగించేందుకు వీలుగా ఆయా శాఖలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది విద్యుత్​శాఖ.

లాక్​డౌన్ కారణంగా వినియోగదారులు తమ బకాయిలను పంపిణీ సంస్థలకు (డిస్కంలు) చెల్లించలేరని తమ ప్రకటనలో పేర్కొంది విద్యుత్​శాఖ. ఇది డిస్కంల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ కారణంగా ఉత్పత్తి, రవాణా సంస్థలకు చెల్లించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అంచనా వేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే.

  • విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, పంపిణీ సంస్థలకు మధ్య అధిక మొత్తంలో బకాయిలు ఉన్నా.. విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగించాలి.
  • పెనాల్టీ, ఆలస్య రుసుములు వసూలు చేయకూడదు. జరిమానాలపై మూడునెలల పాటు తాత్కాలిక నిషేధం.
  • జెన్​కోలకు చెల్లించాల్సిన మొత్తంపై కేంద్ర విద్యుత్ రెగ్యూలేటరీ (సెర్క్) సంస్థ మూడు నెలలపాటు మారటోరియం విధింపునకు ఆదేశం.
  • ప్రస్తుత అత్యవసర సమయంలో ఏ డిస్కంకూ సరఫరాలో కోత ఉండదు.
  • మే 31 వరకు, విద్యుత్ సరఫరా కోసం ఉత్పత్తి సంస్థల వద్ద పంపిణీ సంస్థలు డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని 50 శాతానికి తగ్గింపు.
  • ఉత్పత్తి సంస్థలు, సరఫరా లైసెన్సుదారులకు ఆలస్యంగా జరిగే చెల్లింపులపై సర్‌ఛార్జీల విధింపు రద్దు.
  • రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు ఇవే మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన.

ఇదీ చూడండి:పురుషులు, వృద్ధులకే కరోనా సోకే అవకాశం ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details