తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచమంతా కరెంట్​ కష్టాలు ఖాయం!

ప్రపంచానికి మున్ముందు కరెంట్​ షాక్​ కొట్టబోతోంది. మానవాళిని ఠారెత్తిస్తున్న భూతాపం దెబ్బకు విద్యుత్​ వినియోగం పతాక స్థాయికి చేరబోతోంది. 2050 నాటికి ప్రపంచ విద్యుత్​ అవసరాలు 25శాతం పెరుగుతాయని అంచనా.

By

Published : Aug 7, 2019, 4:50 PM IST

ప్రపంచమంతా కరెంట్​ కష్టాలు ఖాయం!

ఒకప్పుడు ఏసీలు అతికొద్ది మంది ఇళ్లల్లోనే కనిపించేవి. ఇప్పుడు అలా కాదు. ఎటు చూసినా అవే. ఇందుకు కారణం ప్రజల ఆదాయంలో పెరుగుదల కాదు, ఉష్ణోగ్రతలు ఎగబాకడం. మండే ఎండలను తట్టుకునేందుకు ఏసీ అనివార్యమవుతోంది. విద్యుత్​ వాడకం గణనీయంగా పెరుగుతోంది.

జనాభా విస్ఫోటనం, మారుతున్న మనుషుల జీవనశైలి, పుట్టుకొస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తోడై... విద్యుత్​పై విపరీత ఒత్తిడి ఏర్పడబోతోంది. ప్రపంచ విద్యుత్ అవసరాలు 2050 నాటికి మరో 25శాతం పెరుగుతాయని బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం తేల్చింది.

ఎంత విద్యుత్​ అవసరం...?

2050 నాటికి ఇప్పుడు వినియోగిస్తున్న దానికన్నా 2-3 రెట్లు ఎక్కువగా విద్యుత్​ అవసరం.

ప్రస్తుత తలసరి వినియోగం ఎంత..?

విద్యుత్​ తలసరి వినియోగం

అమెరికా, కెనడాలో తలసరి విద్యుత్​ వినియోగం ఐరోపాలో కంటే రెట్టింపు, పేద దేశాల్లో కంటే దాదాపు 800 రెట్లు అధికం.

ఏ విద్యుత్​ ఎంత...?

ఏ విద్యుత్​ ఎంత?

ఏ పరికరానికి ఎంత విద్యుత్​..?

ఏ పరికరానికి ఎంత విద్యుత్?

ప్రపంచవ్యాప్తంగా...

  • 2010 నాటికి ప్రపంచంలో విద్యుత్ ఉత్పత్తి 2100కోట్ల మెగావాట్​ పర్​ అవర్ మాత్రమే.
  • 2050 నాటికి ఇది 4700-5300 కోట్ల మెగావాట్ పర్ అవర్​కు పెరుగుతుంది.

వినియోగం ఎక్కడ ఎంత పెరుగుతుంది..?

ఎక్కడ ఎంత పెరుగుతుంది?

భూతాపం ఒక మోస్తరుగా పెరిగితే 11-17%, విపరీతంగా పెరిగితే 25-58% విద్యుత్​ వినియోగం ఎగబాకుతుందని అంచనా.

భారత్​లో ఇలా...

భారత్​లో కన్నా అమెరికాలో తలసరి వినియోగం 6 రెట్లు ఎక్కువ. అయితే మన దేశ జనాభా 130కోట్లపైనే కాబట్టి... మొత్తం వినియోగం ఎక్కువగా ఉంటుంది.
భారత్​లో విద్యుత్​ స్థాపిత ఉత్పాదక సామర్థ్యం 3.53 లక్షల మెగావాట్లు. కానీ దేశంలో ఏనాడూ వినియోగం గరిష్ఠంగా 1.75లక్షల మెగావాట్లకు మించలేదు. 2030 నాటికి దేశంలో విద్యుత్ ఉత్పత్తి రోజుకు 8.5లక్షల మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. ఆమేరకు విద్యుత్​ డిమాండూ పెరగనుంది.

ఎందుకింత డిమాండ్..?

  • 2050 నాటికి 960 కోట్లకు చేరుకునే ప్రపంచ జనాభాకు భారీగా విద్యుత్​ అవసరం.
  • భూతాపం దెబ్బకు ఉక్కపోత పెరిగి ఏసీలను విపరీతంగా వినియోగిస్తారు.
  • పుట్టుకొస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, విస్తరిస్తున్న అభివృద్ధి కార్యకలాపాలు.
  • కొంగొత్త వినియోగ వస్తువుల తయారీకి అధిక విద్యుత్ వాడకం.

ABOUT THE AUTHOR

...view details