ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్-19)కు మందు కనిపెట్టే పరిశోధనలో పురోగతి సాధించినట్లు తెలిపారు జర్మన్ శాస్త్రవేత్తలు. మానవ ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్ ప్రవేశించడానికి సహాయపడుతున్న ప్రోటీన్‌ను గుర్తించారు పరిశోధకులు. ఈ మేరకు జర్మనీకి చెందిన ‘జర్మన్ ప్రైమేట్ సెంటర్ సహా మరికొంత మంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితాలను ‘జర్నల్ సెల్‌లో ప్రచురించారు.
" ఊపిరితిత్తుల్లోకి కరోనా వైరస్ ప్రవేశించడానికి దోహదపడుతున్న సెల్యులార్ ప్రోటీన్‌ను కనుగొన్నాం. మనిషి శరీరంలో ఉండే టీఎమ్‌పీఆర్‌ఎస్‌ఎస్-2అనే ప్రోటీన్ దీనికి సహకరిస్తోంది. దీని సాయంతోనే కరోనాకు మందు కనుగొనే అవకాశం ఉంది."
--- స్టీఫెన్ పోల్‌మన్, జర్మన్ ప్రైమేట్ సెంటర్ శాస్త్రవేత్త