జమ్ముకశ్మీర్లో సోమవారం నుంచి పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 14 మధ్యాహ్నం నుంచి ఈ సేవలు పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి రోహిత్ కన్సాల్ తెలిపారు. శనివారమే ఈ సేవలు పునరుద్ధరించాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో సాంకేతిక సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
కశ్మీర్ లోయలో 40 లక్షల మంది పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఉన్నారు. వీరికి సేవలు పునరుద్ధరించిన తర్వాత... ప్రీపెయిడ్ కనెక్షన్లను తిరిగి ప్రారంభించనున్నారు. అయితే అంతర్జాల సేవల కోసం ఇంకా కొన్ని రోజులు వేచి చూసే పరిస్థితి నెలకొంది.