నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన ఓ పోస్ట్‌మాన్ గురించి మీకు తెలుసా? గత నాలుగేళ్లలో అతను పోస్టుకార్డులు, ఉత్తరాలు, ఏటీఎంలు ఏవీ ప్రజలకు పంపిణీ చేయలేదు. ఆయనే కర్ణాటక కొప్పల్ జిల్లా సంగనాల గ్రామానికి చెందిన సురేశ్ తలవారా.
నాలుగేళ్లుగా ఉత్తరాలు పంపిణీ చేయని పోస్ట్‌మాన్! - A Lazy karnataka Postmaster Didn't Deliver postcards
ఓ పోస్ట్‌మాన్ గత నాలుగేళ్లుగా ఉత్తరాలు, ఏటీఎంలు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఘటన కర్ణాటక కొప్పల్ జిల్లా సంగనాల గ్రామంలో జరిగింది. విధులను నిర్లక్ష్యం చేసిన పోస్ట్‌మాన్ సురేశ్ తలవారాపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
![నాలుగేళ్లుగా ఉత్తరాలు పంపిణీ చేయని పోస్ట్‌మాన్!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5075447-thumbnail-3x2-postman.jpg)
నాలుగేళ్లుగా ఉత్తరాలు పంపిణీ చేయని పోస్ట్‌మాన్!
నాలుగేళ్లుగా ఉత్తరాలు పంపిణీ చేయని పోస్ట్‌మాన్!
సురేశ్ తలవారా 2014 నుంచి తన విధులను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాడు. దీనితో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ప్రజలు సురేశ్‌ను నిలదీసి, అతని బండారాన్ని బయటపెట్టారు. తపాలా కార్యాలయంలో చూడగా వెయ్యికి పైగా పంపిణీ చేయకుండా ఉంచిన లేఖలు, ఏటీఎంలు కనిపించాయి. ఉన్నతాధికారులు సురేశ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:బూతు బొమ్మలు చూస్తే ఇక సీబీఐ కేసులే!