ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన కుండపోత వర్షాల వల్ల వరద పొటేత్తింది. దీంతో పితోర్‌గఢ్ జిల్లాలోని గోసీ నదిపై ఉన్న రెండు వంతెనలు మంగళవారం ఉదయం కుప్పకూలిపోయాయి. ఫలితంగా ఆ ప్రాంత ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ముగ్గురు మృతి..
వర్షాల కారణంగా ఇళ్లపై బండరాళ్లు పడటం వల్ల రెండు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బంగపాణి సబ్-డివిజన్లో తల్లి, కొడుకులు మరణించగా.. తేజామ్ సబ్-డివిజన్లో ఓ మహిళ చనిపోయింది.
వరద ధాటికి కూలిన వంతెనలు.. ముగ్గురు మృతి పితోర్‌గఢ్‌లో కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జులై 20న తంగా గ్రామంలో 12మంది మృతి చెందారు. జూన్ చివరలో దఖిమ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళలు, ఓ చిన్నారితో సహా నలుగురు గాయపడ్డారు.
ఇదీ చూడండి:శాస్త్రీయ పరిశోధనలకు భారత్-బ్రిటన్ మధ్య ఒప్పందం