తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంపీ మంత్రివర్గంలో సింధియా వర్గానికి కీలక శాఖలు

మధ్యప్రదేశ్​లో నూతనంగా ఏర్పడిన భాజపా ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఇప్పటికే ప్రమాణ స్పీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​.

portfolio-allocation-of-shivraj-ministers-in-madhya-pradesh
మధ్యప్రదేశ్​లో మంత్రి వర్గ విస్తరణ.. సింధియా వర్గానికి కీలక శాఖలు

By

Published : Jul 13, 2020, 11:15 AM IST

Updated : Jul 13, 2020, 11:38 AM IST

మధ్యప్రదేశ్‌లో నూతనంగా కొలువుతీరిన భాజపా ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణం చేసిన నాయకులందరికీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. ‌శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ షాకిచ్చి భాజపాలో చేరిన సింధియా వర్గానికి కీలక శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి.

చౌహాన్ మంత్రివర్గంలో కొత్తగా 28 మంది చేరగా వీరిలో కేబినెట్​ ర్యాంక్​ హోదాలో 20 మంది ఉన్నారు. మరో 8 మంది సహాయమంత్రులు. నలుగురు మహిళా శాసనసభ్యులకు మంత్రివర్గంలో చోటుదక్కింది.

  • పార్టీ సీనియర్ నాయకుడు నరోత్తమ్ మిశ్రాకు హోం శాఖతో పాటు పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయశాఖల బాధ్యత అప్పగింత.
  • భాజపా మహిళా నేత యశోధరరాజె సింధియాకు యువజన సంక్షేమం, క్రీడలు, సాంకేతిక విద్యా శాఖ.
  • తులసీరాం సిలావత్‌కు నీటిపారుదల మత్స్యశాఖ.
  • ఇమ్రాతి దేవికి మహిళా, శిశు సంక్షేమ శాఖ.
  • సింధియా మద్దతుదారులైన డాక్టర్ ప్రభురామ్ చౌదరికు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలను కేటాయించారు.

అధికార కాంగ్రెస్​ పార్టీ నుంచి 22 ఎమ్మెల్యే రాజీనామా చేయటం వల్ల కమలనాథ్​ ప్రభుత్వం కుప్పకూలింది. వీరంతా భాజపాలో చేరిన కారణంగా శివరాజ్​ సింగ్​ చౌహాన్​ నాలుగోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదీ చూడండి:బంగాల్​ భాజపా ఎమ్మెల్యే ఆత్మహత్య?

Last Updated : Jul 13, 2020, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details