తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెరుచుకున్న కేదార్​నాథ్​ ఆలయం- మోదీ తొలిపూజ!

ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత.. ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్​ ఆలయం ఇవాళ తిరిగి తెరుచుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున తొలిపూజ నిర్వహించారు అర్చకులు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. ఆలయ కమిటీ సభ్యులు, పాలనాధికారులు మాత్రమే ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు అనుమతి నిరాకరించారు.

Portals of Kedarnath temple open; first puja performed on behalf of PM
తెరుచుకున్న కేదార్​నాథ్​ ఆలయం.. మోదీ తొలిపూజ!

By

Published : Apr 29, 2020, 10:50 AM IST

ఉత్తరాఖండ్​ కేదార్​నాథ్​ ఆలయం ఇవాళ తిరిగి తెరుచుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్​డౌన్​ అమల్లో ఉన్నందున భక్తులెవరూ హాజరుకాలేదు. పరిమిత సంఖ్యలో ఆలయ కమిటీ సభ్యులు, పాలనాధికారుల నడుమ.. ఉదయం 6.10 గంటలకు సాదాసీదాగా ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున తొలి పూజ చేశారు అర్చకులు. రుద్రాభిషేకం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధికారి పేర్కొన్నారు.

ఆలయద్వారాలు తెరుస్తున్న కమిటీ సభ్యులు
తెరుచుకున్న ఆలయం

6 నెలల తర్వాత తిరిగి తెరుచుకున్నందున.. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. 10 క్వింటాళ్ల పువ్వులతో అలంకరించారు.

పువ్వులతో సుందరంగా ముస్తాబు
మనోహరంగా కేదార్​నాథ్​ ఆలయ పరిసరాలు

6 నెలలకోసారి..

హిమాలయాల్లోని కేదార్​నాథ్​, బద్రీనాథ్​, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను.. మంచు కారణంగా 6 నెలల పాటు మూసివేసి ఉంచుతారు. అప్పుడు భక్తులకు ప్రవేశం ఉండదు. ఏటా ఏప్రిల్​-మే నెల మధ్యలో తిరిగి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.

కేదార్​నాథ్​ ఆలయం
కేదార్​నాథ్​ ఆలయం

ఏప్రిల్​ 26న అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. బద్రీనాథ్​ ఆలయాన్ని మే 15న తెరవనున్నారు.

ABOUT THE AUTHOR

...view details