పూల్పాండ్యన్... తమిళనాడులోని మధురై జిల్లాలో ఓ యాచకుడు. తన ఆకలి తీర్చుకోవాలంటే నలుగురి దగ్గర చేయి చాచాల్సిందే. తెల్లవారి లేస్తే ఆహారం దొరుకుతుందో లేదో అన్న బెంగ తప్పదు. అయినా నలుగురూ ఇచ్చిన రూపాయి రూపాయి కూడబెట్టి.. రూ.10వేలు దాచాడు.
ఆ డబ్బును ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి.. చదువుకోలేని వారికి విరాళంగా ఇవ్వాలనుకున్నాడు పాండ్యన్. కానీ మహమ్మారి కరోనా పరిస్థితులను తారుమారు చేసింది. మనసు చలించిపోయిన పాండ్యన్.. ఆ డబ్బును కరోనా ఉపశమ నిధికి ఇచ్చాడు. స్వయంగా జిల్లా పాలనాధికారికి ఆ మొత్తాన్ని అందించాడు.