తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శీతాకాలంలో కాలుష్యంతో కరోనా మరింత ఉద్ధృతం!

రానున్న రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. గాల్లోని కాలుష్యం వైరస్‌ వ్యాప్తి సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. శీతాకాల పరిస్థితుల వల్ల వ్యాధి సోకని వారే కాకుండా గతంలో కరోనా బారిన పడి కోలుకున్న వారు కూడా కొత్త సవాళ్లను ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

Pollution may increase virus transmissibility making people more vulnerable to COVID-19, say experts
కాలుష్యంతో కరోనా మరింత ఉద్ధృతం

By

Published : Oct 18, 2020, 10:03 PM IST

శీతాకాలంతో పాటు వాతావరణ కాలుష్యం కారణంగా కరోనా వైరస్ మరింతగా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. గాల్లోని కాలుష్యం వైరస్‌ వ్యాప్తి సామర్థ్యాన్ని పెంచుతుందని, ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీనికి తోడు రానున్న శీతాకాల పరిస్థితుల వల్ల వ్యాధి సోకని వారే కాకుండా గతంలో వైరస్​ సోకి కోలుకున్న వారు కూడా కొత్త సవాళ్లను ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

కాలుష్యం వల్ల ఇన్‌ఫ్లూయెంజా లాంటి వైరస్ వ్యాప్తితో పాటు శ్వాసకోశ వ్యాధులు సైతం విజృంభించే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. గాలి నాణ్యత తగ్గిపోతే ఆ గాలిలో కరోనా వైరస్ ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉందని.. దాని వల్ల కేసుల్లో మరింత పెరుగుదల ఉండవచ్చునని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details