గతేడాది కంటే ఈ ఏడాది దీపావళికి.. దిల్లీ కాలుష్యం మరింత పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల వల్ల, చుట్టు పక్కల రాష్ట్రాల్లో.. వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరినట్లు పేర్కొంది.
ఈ మేరకు. .కాలుష్య వివరాలకు సంబంధించి ఓ నివేదికని సమర్పించింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. గతేడాది వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల 19 శాతం కాలుష్యం నమోదైందని తెలిపింది. ఈ ఏడాది అది 32 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.
"ఈ ఏడాది దీపావళి పండగ నవంబర్ మధ్యకాలంలో రావడం వల్ల వాతావరణ మార్పు ప్రభావం కాలుష్యంపై మరింతగా ఉంది. గతేడాది .. అక్టోబర్ చివరి వారంలో పండగ జరగడం వల్ల ఈ తీవ్రత కాస్త స్వల్పంగా ఉంది" అని నివేదికలో పేర్కొంది సీపీసీబీ.
గత నాలుగేళ్లలో ఈరోజే తీవ్రంగా!...