70 స్థానాలున్న దిల్లీ శాసనసభకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రజాస్వామ్యంలోని అతి ముఖ్యమైన హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కోటి 47 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు.
ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారుల. ఒక్కో నియోజకవర్గం చొప్పున మొత్తం 70 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు తగిన ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగంకుండా 90 వేల మంది భద్రతా బలగాలను దిల్లీ అంతటా మోహరించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
షహీన్బాగ్పై ప్రత్యేక నిఘా..