తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటేసిన ప్రముఖులు... ప్రశాంతంగా పోలింగ్​ - పోలింగ్​

'సార్వత్రికం' ఐదో విడత ఎన్నికలు​ ప్రశాంతంగా సాగుతున్నాయి. ప్రముఖులు ఓటేయడానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల ముందు బారులుదీరారు.

ఓటేసిన ప్రముఖులు... ప్రశాంతంగా పోలింగ్​

By

Published : May 6, 2019, 9:31 AM IST

'సార్వత్రికం' ఐదో విడత ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల ముందు బారులుదీరారు ఓటర్లు.

ఓటేసిన ప్రముఖులు...

ఓటేసిన ప్రముఖులు... ప్రశాంతంగా పోలింగ్​

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్​ సిన్హా.. అందరికన్నా ముందే ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్​ కేంద్రానికి చేరుకున్నారు. ఆయన భార్యతో కలిసి ఝార్ఖండ్​ హజారీబాగ్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు. ఇక్కడ ఆయన కుమారుడు జయంత్​ సిన్హా భాజపా అభ్యర్థి.

కేంద్రమంత్రులు రాజ్​నాథ్​ సింగ్​ లఖ్​నవూ స్కాలర్స్​ హోమ్​ స్కూల్​ పోలింగ్​ బూత్​లో, రాజ్యవర్ధన్​ సింగ్​ రాఠోడ్​ జైపుర్​లో కుటుంబసమేతంగా ఓటు వినియోగించుకున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. లఖ్​నవూలోని సిటీ మాంటిస్సోరి కళాశాలలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామి అయ్యారు.

పుల్వామాలో పటిష్ఠ భద్రత...

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అల్లర్లు జరగకుండా అనుక్షణం పహారా కాస్తున్నారు. ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.

బంగాల్​లోని కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో సాంకేతిక సమస్య కారణంగా.. ఓటింగ్​ ఆలస్యంగా ప్రారంభమైంది.

గ్రనేడ్​ కలకలం...

ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న తరుణంలో పుల్వామాలోని ఓ పోలింగ్​ కేంద్రంలో గ్రనేడ్​ దాడి జరిగింది. ఎవరికీ ప్రమాదం జరగనప్పటికీ.. ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఎన్నికల్లో భాగస్వామ్యం కావాలని మోదీ ట్వీట్​...

పోలింగ్​ ప్రారంభానికి కొద్ది సేపు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. రికార్డు స్థాయి ఓటింగ్​ శాతానికి కృషి చేయాలని కోరారు. భారత బంగారు భవిష్యత్తు కోసం పోలింగ్​లో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details