తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2 రాష్ట్రాల ఫలితాలు.. భాజపాకు గుణపాఠం: కాంగ్రెస్​ - హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్​ స్పందించింది. మహారాష్ట్ర, హరియాణాల్లో ప్రజల తీర్పుతో అధికార భాజపాకు నైతికంగా ఓటమే ఎదురైనట్లు ఎద్దేవా చేసింది. కాషాయ పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందని విమర్శించింది.

రెండు రాష్ట్రాల ఫలితాలతో భాజపాకు గుణపాఠం : కాంగ్రెస్​

By

Published : Oct 24, 2019, 8:56 PM IST

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో భాజపా నైతికంగా ఓడిపోయిందని కాంగ్రెస్​ విమర్శించింది.

హరియాణాలో భాజపా విజయం సాధించిందని అమిత్​ షా ప్రకటించుకున్నంత మాత్రాన మెజారిటీ సాధించలేరన్నారు కాంగ్రెస్​ సీనియర్ నేత​ ఆనంద్​ శర్మ. ఓట్ల శాతం కాషాయ పార్టీకి గణనీయంగా తగ్గిందన్నారు. హరియాణాలో ప్రజల తీర్పు... భాజపాపై వ్యతిరేకతను ప్రతిబింబిస్తుందన్నారు. భాజపాను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు ఆనంద్​ శర్మ.

ఈ ఎన్నికల్లో హరియాణాలో కాంగ్రెస్​ పుంజుకుంది. 2014లో 15 స్థానాలే నెగ్గిన హస్తం పార్టీ ఈ సారి 31 చోట్ల విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం కాగా... అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా 40 స్థానాలకే పరిమితమైంది.

మహారాష్ట్రలో భాజపా-శివసేన కూటమికి సాధారణ మెజార్టీ వచ్చినప్పటికీ క్రితం సారి కంటే స్థానాలు తగ్గాయి. 2014లో 122 చోట్ల నెగ్గిన కాషాయ పార్టీ దాదాపు 20 స్థానాలు కోల్పోయింది. కాంగ్రెస్​-ఎన్సీపీలు... భాజపా-సేన కూటమికి గట్టి పోటీ ఇచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details