తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ సమావేశంపై దర్యాప్తు

విద్యార్థినులతో రాహుల్​ గాంధీ సమావేశ అనుమతులపై తమిళనాడు ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ఏవిధంగా అనుమతులు ఇచ్చారని స్టెల్లా మారిస్​ కళాశాలపై దర్యాప్తునకు ఆదేశించింది.

By

Published : Mar 15, 2019, 8:34 PM IST

రాహుల్​ సమావేశంపై దర్యాప్తు

స్టెల్లా మారిస్ కళాశాల విద్యార్థినులతో రాహుల్​ గాంధీ సమావేశానికి అనుమతులపై ఆరా తీస్తోంది తమిళనాడు ప్రభుత్వం. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ఏ విధంగా అనుమతులు ఇచ్చారని పేర్కొంటూ ​కళాశాలపై దర్యాప్తునకు ఆదేశించింది.

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ రెండు రోజుల క్రితం స్టెల్లా మారిస్​ కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రఫేల్​ వివాదంపై మరోమారు భాజపాపై ఆరోపణలు చేశారు. రాబర్ట్​ వాద్రాపై ఓ విద్యార్థిని ప్రశ్నించగా చట్టం అందరికిీ సమానంగా వర్తిస్తుందని పేర్కొన్నారు.

విచారణకు ఆదేశించిన కళాశాల బోర్డు

ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు కళాశాల విద్యా బోర్డు డైరెక్టర్​ ఆర్​.సరుమతి. లోక్​సభ ఎన్నికల నియమావళి అమలులో ఉండగా రాహుల్​ సమావేశానికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని రీజనల్​ జాయింట్​ డైరెక్టర్​ను ప్రశ్నించారు.

ఎన్నికల నియమావళిని పాటించాలి

చెన్నైలో ఉన్న 10 ప్రభుత్వ ఎయిడెడ్​ కళాశాలల్లో స్టెల్లా మారిస్ ఒకటి​. ఇలాంటి విద్యాసంస్థలు రాష్ట్ర నియమాలనే కాదు, ఎన్నికల నియమావళిని అనుసరించాలనే నిబంధన ఉంది.

ఎన్నికల నియమావళి ప్రకారం విద్యా సంస్థలు (ప్రభుత్వ, ఎయిడెడ్​, ప్రైవేట్​) వాటి మైదానాలను ఎన్నికల ప్రచారాలకు, ర్యాలీలకు వినియోగించకూడదు.

యాజమాన్యం మౌనం

కళాశాల విద్యాబోర్డు విచారణ చేపట్టిందా అన్న ప్రశ్నకు స్పందించలేదు స్టెల్లా మారిస్​కళాశాల యాజమాన్యం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సైతం ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details