తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అడ్వాణీతో మురళీ మనోహర్ జోషి భేటీ

భాజపా కురువృద్ధుడు ఎల్​కే అడ్వాణీతో భేటీ అయ్యారు సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. భాజపాను వ్యతిరేకించే వారందరూ దేశ ద్రోహులు కాదని అడ్వాణీ తన బ్లాగులో పేర్కొన్న మరుసటి రోజే జోషి సమావేశమవటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

అడ్వాణీతో ఎంఎం జోషి

By

Published : Apr 6, 2019, 3:35 AM IST

భాజపా సహ వ్యవస్థాపకుడు, అగ్రనేత లాల్​కృష్ణ అడ్వాణీతో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి శుక్రవారం భేటీ అయ్యారు. వీరిద్దరికీ ఈ లోక్​సభ ఎన్నికల్లో టికెట్​ కేటాయించలేదు భాజపా. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించకుంది.

భాజపాను వ్యతిరేకించినంత మాత్రాన దేశద్రోహులు కారని అడ్వాణీ తన బ్లాగులో గురువారం వ్యాఖ్యానించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందేశంలో భాజపా సిద్ధాంతాలను గుర్తు చేశారు. మనోగతాన్ని బహిర్గతపరిచారు.

అడ్వాణీ వ్యాఖ్యలు భాజపా ముఖ్యనేతలను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బాలాకోట్ వైమానిక దాడులపై ప్రశ్నించిన వారిని ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా దేశ ద్రోహులని దుయ్యబట్టిన విషయం తెలిసిందే.

భారతీయ జనతా పార్టీకి ఎక్కువకాలం అధ్యక్షుడిగా వ్యవహరించారు అడ్వాణీ. గాంధీనగర్ లోక్​సభ స్థానం నుంచి ఆరు సార్లు గెలుపొందారు. జోషి కూడా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పార్టీకి మూడో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

కాన్పూర్ నుంచి జోషి టికెట్ ఆశించగా భాజపా నిరాకరించింది. ఆయనకు బదులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నియమించిన భాజపా ప్రధాన కార్యదర్శి రామ్​లాల్​ను పోటీకి నిలబెట్టింది.

ABOUT THE AUTHOR

...view details