భారత సంస్కృతిలో వివక్షపూరితమైన రాజకీయాలు అల్లుకుపోవటం బాధ కలిగిస్తోందన్నారు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సమాజంలో కులం, మతం ఆధారంగా ఏర్పడ్డ విభేదాలను ప్రజలు కూకటివేళ్లతో పెకిలించివేయాలని కోరారు.
మార్చి 1న 'ప్రపంచ వివక్ష రహిత రోజు' సందర్భంగా ట్విట్టర్ వేదికగా భాజపాపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు మమత. దేశ ప్రజలను భాజపా మత ప్రాతిపదికన విభజించాలని చూస్తోందని ఆరోపించారు.
" ఈ రోజు ఐరాస వివక్ష రహిత రోజు. భారత సంస్కృతిలోకి వివక్షపూరితమైన రాజకీయాలు చేరటం నాకు బాధగా ఉంది. సమాజంలో కులం, మతం ఆధారంగా పేరుకుపోయిన విభేదాలను కూకటివేళ్లతో పెకిలించి వేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. ఎలాంటి వివక్షను సహించకూడదు."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.