జనాభా నియంత్రణకు అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని తెలిపింది. సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన వర్తించనుంది.
చిన్న కుటుంబాల ప్రమాణాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే.. వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది అసోం ప్రభుత్వం.