తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పారికర్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం - ట్వీట్స్​

మనోహర్ పారికర్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

పారికర్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

By

Published : Mar 17, 2019, 9:39 PM IST

Updated : Mar 17, 2019, 11:12 PM IST

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో తమ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన లోటు పూడ్చలేనిదని పలువురు నాయకులు విచారం వ్యక్తం చేశారు.

పారికర్ మరణం విచారకరం: రాష్ట్రపతి

"గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం విచారకరం. ఆయన సేవలను గోవా ప్రజలు, దేశం మర్చిపోదు" --రామ్​నాథ్ కోవింద్, రాష్ట్రపతి

రక్షణమంత్రిగా ఎనలేని సేవలు అందించారు: ప్రధాని మోదీ

"పారికర్ నిజమైన దేశభక్తుడు. గొప్ప పాలనాదక్షుడు, ఎందరికో ఆయన స్ఫూర్తి. గోవా రాష్ట్రాన్నిసరికొత్తగా నిర్మించారు. ఆయన పాలనలో గోవా ఎంతో అభివృద్ధి చెందింది. రక్షణమంత్రిగా ఆయన సేవలను తర్వాతి తరాలూ గుర్తుపెట్టుకుంటాయి" -- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

పారికర్ గోవా ముద్దు బిడ్డ: రాహుల్ గాంధీ

"పారికర్​ మరణంచాలా బాధాకరం. ఆయన గోవా ముద్దు బిడ్డ. పారికర్​ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అనారోగ్యాన్నిఆయన ఏడాది కాలంగా ఎంతోధైర్యంగా పోరాడారు" --రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు.

పారికర్​ఆత్మకు శాంతి కలగాలి: అశోక్ గహ్లోత్

"మనోహర్ పారికర్ మృతి పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. పారికర్ ఆత్మకు శాంతి కలగాలి" -- అశోక్ ​గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి

ప్రియమైననేస్తాన్ని కోల్పోయాను: నితిన్ గడ్కరీ

"మనోహర్ పారికర్​ మరణం భాజపాకు తీరని లోటు. పార్టీ నేతగానే కాకుండా ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. ఇక నుంచి ఆయన నా పక్కన ఉండడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా" -- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి.

మంచి రాజకీయవేత్తను కోల్పోయాం: మల్లిఖార్జున ఖర్గే

"మంచి మనిషిని, రాజకీయవేత్తను కోల్పోయాం. రాజకీయాల్లో ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన మరణం చాలా విచారకరం. మా పార్టీ తరపున నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను" --మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత

Last Updated : Mar 17, 2019, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details