బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రజలు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఉదయం 10 గంటల వరకు పోలింగ్ శాతం 8.15గా నమోదైంది. 94 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
బామ్మను సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తున్న యువతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ప్రముఖుల ఓటు..
ఓటేసిన అనంతరం సీఎం నితీశ్ ఓటు హక్కు వినియోగించుకున్న తేజస్వీ బిహార్ గవర్నర్ ఫాగూ చౌహాన్, సీఎం నితీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ వంటి ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ ఓటు శక్తితో బిహార్ ప్రజలు మార్పు తీసుకొస్తారని తేజస్వీ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ మోదీ ట్వీట్..
బిహార్ రెండో విడత ఎన్నికల్లో ప్రజలు భారీగా పాల్గొనాలని మోదీ కోరారు. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని ట్వీట్ చేశారు. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని సూచించారు.
మరో 10 రాష్ట్రాల్లో..
దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 28, గుజరాత్లో 8, ఉత్తర్‌ప్రదేశ్‌లో 7, ఒడిశా, నాగలాండ్, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రెండు స్థానాలకు, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న అధికారులు