తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకీయ నేతలైనా 'రంగు పడాల్సిందే' - Abbas

దేశవ్యాప్తంగా రాజకీయనాయకులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కేంద్రమంత్రి ముక్తార్​ అబ్బాస్​ నక్వీ దిల్లీలో కళాకారులతో కలిసి డోలు వాయించారు.

హోలీ సంబరాల్లో రాజకీయనాయకులు

By

Published : Mar 21, 2019, 6:00 PM IST

హోలీ సంబరాల్లో రాజకీయనాయకులు
దేశంలో ఎటు చూసినా హోలీ సందడే. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల పండుగను ఆస్వాదిస్తున్నారు. మేమూ తక్కువేమీ కాదంటూ రాజకీయ నేతలూ హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. రంగుల్లో మునిగి తేలుతున్నారు.

కేంద్రమంత్రి ముక్తార్​ అబ్బాస్​ నక్వీ, లోక్​సభ ఎంపీ హేమమాలిని, ఉత్తరప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​ హోలీ సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

డోలు వాయించిన కేంద్రమంత్రి

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నక్వీ దిల్లీలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానిక నేతలు, ప్రజలతో కలిసి డోలు వాయిస్తూ నృత్యం చేశారు.

మథురలో హేమామాలిని

భాజపా లోక్​సభ ఎంపీ హేమమాలిని మథురలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బృందావనంలోని తన స్వగృహంలో హోలీని ఘనంగా జరుపుకున్నారు.

" ప్రజలందరికి నా తరఫున హోలీ శుభాకాంక్షలు. ఈ పండుగ రోజున బృందావనంలోని నా స్వగృహంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రజలతో కలిసి హోలీని చాలా బాగా జరుపుకున్నాను."
-హేమమాలిని, భాజపా ఎంపీ

సైఫయిలో అఖిలేశ్​ 'హోలీ'

ఉత్తరప్రదేశ్ ఎటావా జిల్లాలోని సైఫయి గ్రామంలో ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ హోలీని వైభవంగా జరుపుకున్నారు.​ ఈ సందర్భంగా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details