తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సిద్ధూ.. వ్యక్తిగతంగా కర్తార్​పుర్​ ప్రారంభోత్సవానికి వెళ్లొచ్చు' - కర్తార్​పుర్ వెళ్లేందుకు నవజోత్​సింగ్​కు అనుమతి

కర్తార్​పుర్ నడవా ప్రారంభోత్సవం చరిత్రాత్మకమని, వ్యక్తిగతంగా ఎవరైనా ఈ వేడుకకు హాజరుకావచ్చని విదేశాంగమంత్రిత్వశాఖ పేర్కొంది. కర్తార్​పుర్ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాలంటూ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజోత్​సింగ్ సిద్ధూ రాసిన లేఖలపై ఎంహెచ్​ఏ ఈ విధంగా స్పందించింది.

కర్తార్​పుర్ వెళ్లేందుకు నవజోత్​సింగ్​కు అనుమతి

By

Published : Nov 7, 2019, 8:15 PM IST

కర్తార్​పుర్ నడవా ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ మాజీ క్రికెటర్​, పంజాబ్​ ఎమ్మెల్యే నవజోత్ సింగ్ పదేపదే చేసిన విజ్ఞప్తిపై విదేశాంగమంత్రిత్వశాఖ స్పందించింది. కర్తార్​పుర్ నడవా ప్రారంభోత్సవం 'చరిత్రాత్మక' సంఘటన అని పేర్కొంది. వ్యక్తిగతంగా ఈ వేడుకకు ఎవరైనా హాజరుకావచ్చని, దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

సాధారణ పౌరునిలా..

పాకిస్థాన్​కు తాను​ వెళ్లడంపై ఏదైనా అభ్యంతరం ఉంటే, అదేంటో స్పష్టం చేయాలని కోరుతూ నవజోత్​ సింగ్ సిద్ధూ విదేశాంగమంత్రిత్వశాఖకు మూడు లేఖలు రాశారు. మూడో లేఖకూ స్పందించకపోతే.. ఇతర యాత్రికుల మాదిరిగా తానూ పాకిస్థాన్​లోని పవిత్ర గురుద్వారాను సందర్శిస్తానని సిద్ధూ స్పష్టం చేశారు.

20 ఏళ్లుగా ఎదురుచూశాం..

సిద్ధూ లేఖలపై విదేశాంగమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్ స్పందించారు. కర్తార్​పుర్ నడవా సాకారానికి 20 ఏళ్లుగా భారత్​ చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలవంతం అయ్యిందని ఆయన పేర్కొన్నారు.

"నవంబర్ 9న జరిగే కర్తార్​పుర్ నడవా ప్రారంభోత్సవం చరిత్రాత్మకం అందువల్ల ఓ వ్యక్తిని ప్రత్యేకంగా చూడడం జరగదు. ఎవరైనా వ్యక్తిగతంగా ఈ వేడుకకు హాజరవ్వచ్చు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు."- రవీశ్​కుమార్, భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి

సిద్ధూకు పాక్​ వీసా

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి హాజరవ్వాలని నవజోత్​ సింగ్​ సిద్ధూను పాకిస్థాన్ ప్రభుత్వం ఆహ్వానించింది. దీనికి సిద్ధూ కూడా అంగీకరించారని తెలిపింది. తాజాగా ఆయనకు వీసాను కూడా మంజూరుచేసింది.

ఇదీ చూడండి: ఈ నెల 13,14న జరిగే బ్రిక్స్​ సదస్సుకు మోదీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details