అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు జాతీయస్థాయి నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగను కూడా ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీలు సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో పర్యటించి.. అక్కడి ప్రజలతో పండుగను జరుపుకోనున్నారు.
ఎడ్లబండిపై నడ్డా సవారీ..
సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర భాజపా బృందం ఏర్పాటు చేసిన "నమ్మ ఓరు పొంగల్ విళ(మన నగరం- మన సంక్రాంతి)" వేడుకల్లో నడ్డా పాల్గొననున్నారు. క్రీడా పోటీలు, సంప్రదాయ కళలను వీక్షించనున్నారు. ఎడ్లబండిపై సవారీ చేసిన అనంతరం తన ప్రసంగంతో వేడుకను ముగించనున్నారు.
తమిళ సంచిక తుగ్లక్ వార్షిక వేడుకలకు కూడా నడ్డా హాజరుకానున్నారు.
జల్లికట్టుకు రాహుల్..