మణిపుర్ రాజధాని ఇంఫాల్ నగరంలో ఐఈడీ బాంబు పేలింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు, ఓ పౌరునికి తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మణిపుర్లో బాంబు పేలుడు.. ఐదుగురికి గాయాలు - మణిపు బాంబు పేలుడులో ర్ఐదుగురు పోలీసులకు, ఓ సామాన్య వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
మణిపుర్ ఇంఫాల్ నగరంలో ఐఈడీ పేల్చారు దుండగులు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు, ఓ పౌరుడు గాయపడ్డారు.
మణిపుర్లో బాంబు పేలుడు, ఐదుగురు గాయాలు
అప్రమత్తమైన సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో థంగల్ బజార్లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇంఫాల్‌లో గత నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండో దాడి కావడం గమనార్హం.
ఇదీ చూడండి : డ్రైవర్ నిద్రతో ప్రమాదం... ఐదుగురు మృతి
Last Updated : Nov 5, 2019, 6:00 PM IST
TAGGED:
manipur latest bomb blast