తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో ఎదురుపడ్డ పోలీస్ అన్న-నక్సల్​​ చెల్లి

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో పోలీసు అన్న- నక్సలైట్​ చెల్లి ఎదురుపడ్డారు. చెల్లి చాకచక్యంగా తప్పించుకుంది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

By

Published : Aug 13, 2019, 12:39 PM IST

Updated : Sep 26, 2019, 8:41 PM IST

ఎన్​కౌంటర్​లో ఎదురుపడ్డ పోలీస్ అన్న-నక్సల్​​ చెల్లి

పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో అన్నాచెల్లెల్లు ప్రత్యర్థులుగా తలపడిన అరుదైన ఘటన ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుగా అన్న- నక్సలైట్​గా చెల్లి ఎదురుపడ్డారు.

గతంలో మావోయిస్టుగా ఉన్న వెట్టి రామ అనే వ్యక్తి గత ఏడాది చీకటి పోరాటాన్ని వదిలి పోలీసుల్లో చేరారు. ఆయన చెల్లి మాత్రం నక్సలైట్​గానే ఉండిపోయింది.

"జులై 29న జరిగిన ఎన్​కౌంటర్​ సందర్భంగా పోలీసు వెట్టి రామ, అతడి నక్సలైట్​ చెల్లెలు వెట్టి కన్ని ఎదురుపడ్డారు. కన్నితో వచ్చినవారు రామపై కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కన్ని చాకచక్యంగా తప్పించుకుంది."

- శలాభ్​ సిన్హా, జిల్లా ఎస్పీ.

రక్షాబంధన్​ కానుకగా ఆయుధాలు విడనాడాలని తన చెల్లికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు రామ. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదని తెలిపారు.

"చాలాసార్లు మా చెల్లికి లేఖ రాశాను. పోలీసు దళంలో చేరాలని విజ్ఞప్తి చేశాను. రక్షాబంధన్​ కానుకగా ఆయుధాలను విడనాడాలని కోరాను. పండుగలు జరుపుకోవటంపై తనకు విశ్వాసం లేకపోవటం వల్ల నా విజ్ఞప్తిని ఆమె తోసిపుచ్చుతుందని నాకు తెలుసు. కానీ ఆమెతో మాట్లాడేందుకు నాకు ఇదొక్కటే దారి."
- వెట్టి రామ, పోలీస్​

ఇదీ చూడండి: టేకాఫ్​లో సాంకేతిక లోపం- గడ్కరీకి తప్పిన ముప్పు

Last Updated : Sep 26, 2019, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details