తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చితిలో సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు - మధ్య ప్రదేశ్ లేటెస్ట్​ న్యూస్​

మధ్యప్రదేశ్​లో షాకింగ్ ఘటన జరిగింది. దహన సంస్కారాలను మధ్యలోనే ఆపి సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లారు పోలీసులు. చనిపోయిన వ్యక్తి హత్యకు గురయ్యాడనే అనుమానంతో ఇలా చేశారు.

Police stop cremation and take dead body for autopsy
చితిలో సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

By

Published : Oct 12, 2020, 1:39 PM IST

మధ్యప్రదేశ్​ రాజ్​గఢ్​లో జరిగిన ఓ ఘటన స్థానికులను విస్మయానికి గురి చేసింది. బంధువుల సమక్షంలో జరగుతున్న దహన సంస్కారాలను మధ్యలోనే ఆపి సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లారు పోలీసులు. అనంతరం భౌతికకాయాన్ని పంచనామాకు తరలించారు. తన భర్తను బంధువులు హత్య చేశారని భార్య చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలకు ఉపక్రమించారు.

ప్రేమ్​సింగ్​, రేఖా భాయ్​ అనే దంపతుల మధ్య నెల రోజుల క్రితం గొడవ జరిగింది. అనంతరం పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది రేఖ. ఇటీవల అనారోగ్యానికి గురైన భర్త శనివారం మరణించాడు. ఈ విషయాన్ని భార్యకు తెలియజేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు.

విషయం తెలుసుకున్న రేఖా భాయ్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తను బంధువులే హత్య చేసి ఉంటారని ఆరోపించింది. హూటాహుటిన బయలుదేరిన పోలీసులు అప్పటికే మొదలైన దహన సంస్కారాలు ఆపి శవాన్ని పోస్ట్​ మార్టమ్​కు పంపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు తిరిగి అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details