తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం 'కార్టూన్​' అస్త్రం - సామాన్యులకి చేరువవ్వాలని పోలీసులు 'కార్టూన్'​ అస్త్రం

కార్టూన్... పిల్లల నుంచి  పండు ముసలి వరకు అందరిచేత నవ్వులు పూయిస్తుంది. తీవ్ర ఒత్తిడి, చికాకులో నుంచి కొంతమేర ఊరటనిస్తుంది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఫ్రెండ్లీ పోలీసింగ్​ కోసం కార్టూన్​ను​ అస్త్రంగా ఎంచుకున్నారు కేరళ పోలీసులు.

cartoon
ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం 'కార్టూన్​' అస్త్రం

By

Published : Jan 9, 2020, 6:01 AM IST

ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం 'కార్టూన్​' అస్త్రం

సామాన్యులతో స్నేహభావాన్ని పెంపొందించేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు కేరళ పోలీసులు. పోలీసులు, ఠాణా అంటే చాలా మందికి గుబులే. ఈ భయాన్ని తొలిగించాలని తిరువనంతపురం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం స్టేషన్ ​గోడలపై కార్టూన్​ చిత్ర పటాలను ఏర్పాటు చేశారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్​ కోసమే..

పోలీస్​ స్టేషన్​ను సేవా కేంద్రంగా భావించాలనే వీరి ముఖ్య ఉద్దేశం. ఠాణాలో కార్టూన్లను చూస్తే వచ్చినవారి మనసు ఆహ్లాదంగా మారుతుందనేది పోలీసుల అభిప్రాయం. నెల రోజుల్లోగా అన్నీ ఠాణాల్లో కార్టూన్లను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు.

ఇదీ చూడండి : చలిపులి నుంచి కాపాడే బాబా రామ్​దేవ్ సూత్రాలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details