కేరళ కాసరగోడ్ జిల్లాలోని బేకాల్ పోలీస్‌స్టేషన్‌ను చూస్తే ఎవరైనా లగ్జరీ హోటల్ అనే భావిస్తారు. చూట్టూ పూల మొక్కలు, లోపలికి అడుగు పెట్టగానే అక్వేరియం, సేదతీరడానికి కుర్చీలు, సోఫాలు, ఇలా ఒకటేంటి అన్ని హైటెక్ హంగులను తలపిస్తాయి. ఫిర్యాదు చేయాడానికి ఎవరైనా వస్తే ఓ క్షణం ఆగి ఎక్కడికి వచ్చామా? అని ఆలోచించుకోవాల్సిందే.
పదిలక్షలు ఖర్చుపెట్టి...
మొదట అన్ని స్టేషన్లులానే ఉండేది బేకాల్ పోలీస్‌స్టేషన్. ఈ విధంగా మారడానికి సుమారు రూ. 10లక్షలు ఖర్చు చేశారు. ప్రభుత్వం అందించే సాయంతో పాటు స్థానికులూ సహకారం అందించారు. కేవలం 21 రోజుల్లోనే సర్వాంగ సుందరంగా మారింది ఈ స్టేషన్. కాసరగోడ్, కన్హంగాడ్లను కలిపే రాష్ట్ర రహదారిపై ఈ పోలీస్ స్టేషన్ ఉంది. దీనికి అద్దిన రంగులతో సుందరంగా కనిపించడమే కాక.. రాత్రి సమయంలో కాంతులతో చూపరులను ఆకట్టుకుంటుంది.