తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహిళల్లో విశ్వాసం పెంచేలా పోలీసు సేవలుండాలి'

మహిళలు, పిల్లలు సహా సమాజంలోని అన్ని వర్గాల్లో తాము సురక్షితంగా ఉన్నామన్న భావన కలిగేలా పోలీసులు సమర్థంగా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీలతో జరిగిన సమావేశంలో వారికి పలు కీలక సూచనలు చేశారు.

MODI
మోదీ

By

Published : Dec 9, 2019, 6:30 AM IST

హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులకు కీలక సూచనలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మహిళల్లో విశ్వాసాన్ని పెంచేలా పోలీసులు సమర్థంగా సేవలు అందించాలని పేర్కొన్నారు. తాము సురక్షితంగా ఉన్నామనే భావన మహిళలు, పిల్లలు సహా సమాజంలోని అన్ని వర్గాల్లో కలిగేలా పోలీసులు తగిన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ.

పుణెలో ఆదివారం ముగిసిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని పోలీసు శాఖకు మోదీ సూచించారు.

ఉగ్రవాదం సవాలుగా మారింది

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్‌) దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించే దిశగా భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఉగ్రవాదం పెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఉగ్ర భూతం పీచమణిచేలా దక్షిణాసియా దేశాలు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సార్క్‌ 35వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సంఘం సచివాలయానికి రాసిన లేఖలో మోదీ ఈ విషయాలను ప్రస్తావించారు.

ఇదీ చూడండి:నేడు లోక్​సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు

ABOUT THE AUTHOR

...view details