మధ్యప్రదేశ్ బర్వానీ సెంద్వా ప్రాంతానికి చెందిన ఓ భాజపా నేత మద్యం గోదాములో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
భాజపా నేత సంజయ్ యాదవ్ లిక్కర్ గోదాంలో అక్రమ ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో ఎస్పీ యంగ్చాన్ ధోల్కర్ భూటియా ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 13 పిస్తోళ్లు, 111 లైవ్ కాట్రిడ్జులు, 17 గ్రనేడ్లు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంజయ్ యాదవ్, అతని సోదరుడు జితు యాదవ్‌లపై పోలీసులు ఆయుధ చట్టం, పేలుడు పదార్ధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. సంజయ్ తల్లి సెంద్వా మున్సిపల్ అధ్యక్షురాలుగా ఉన్నారు. సోదాల సమయంలో ఆమె అక్కడే ఉన్నారు.