తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శశికళ ఉన్న జైలులో భారీగా ఆయుధాలు, గంజాయి - weapons in jail

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భారీ సంఖ్యలో ఆయుధాలు, గంజాయి, చరవాణి, సిమ్​ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

పరప్పన అగ్రహార జైలులో భారీగా ఆయుధాలు, గంజాయి

By

Published : Oct 9, 2019, 2:23 PM IST

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్​ జైలులో భారీగా ఆయుధ సామగ్రి, గంజాయి పట్టుబడింది.

గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్​కు చెందిన 50 మంది పోలీసులు ఈ ఉదయం జైలులో సోదాలు చేపట్టారు. ఓ చెట్టు కింద భూమిలో 37 పదునైన ఆయుధాలు, గంజాయి, గంజాయి సేవించేందుకు ఉపయోగించే గొట్టాలు, మొబైల్ ఫోన్​, కొన్ని సిమ్​ కార్డులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలతో జైళ్ల శాఖకు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

పరప్పన అగ్రహార జైలులో భారీగా ఆయుధాలు, గంజాయి
పరప్పన అగ్రహార జైలులో భారీగా ఆయుధాలు, గంజాయి
పరప్పన అగ్రహార జైలులో భారీగా ఆయుధాలు, గంజాయి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ... అక్రమాస్తుల కేసులో ఇదే జైలు మహిళా విభాగంలో శిక్ష అనుభవిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details