ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బదాయూ జిల్లా వజీర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను సాధారణ సోదాల పేరుతో ఆపి... వారి ముఖంపై తుపాకులను గురి పెట్టి తనిఖీలు చేశారు. వాహనదారులు తమ చేతులను పైకెత్తి నిలబడిపోయి భయంతో వణికిపోయారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
వాహనదారులపైకి తూపాకీ ఎక్కుపెట్టిన పోలీసులు - UP
ఉత్తర్ప్రదేశ్ వజీర్గంజ్ బదాయూలో పోలీసులు వాహనదారులపైకి తుపాకులను ఎక్కుపెట్టారు. సాధారణ సోదాల్లో భాగంగా ఇలా చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల తీరుతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు.
వాహనదారులపైకి తూపాకీ ఎక్కుపెట్టిన పోలీసులు
తనిఖీలు చేస్తున్నసమయంలో పోలీసులపై నేరస్థులు కాల్పులు జరిపిన ఘటనలున్నాయని, అందుకే ఈ విధానాన్నిఅనుసరించినట్లు బదాయూ సీనియర్ ఎస్పీ వివరణ ఇచ్చారు.
ఇదీ చూడండి: దారుణం: మూక దాడిలో యువకుని మృతి