తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డీజీపీ పదవికి ఆర్నెల్లుండాలి! - DGP

కనీసం ఆరునెలల పదవీకాలం మిగిలి ఉన్న పోలీసు అధికారులనే డీజీపీ పోస్టుకు ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత ఇచ్చింది.

డీజీపీ పదోన్నతిపై సుప్రీంకోర్టు

By

Published : Mar 13, 2019, 4:23 PM IST

డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ పోలీస్​ (డీజీపీ) పదవికి కనీసం ఆరు నెలల పదవీకాలం మిగిలున్న అధికారులనే సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
యోగ్యత​ ప్రాతిపదికనే డీజీపీ ఎంపిక జరగాలని యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(యూపీఎస్​సీ)కు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.

డీజీపీ ఎంపికలో ఎలాంటి అవకతవకలు, పక్షపాత ధోరణికి తావు ఉండకూడదని గతేడాది జులై 3న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక డీజీపీగా నియమించే అధికారులకు తప్పనిసరిగా రెండేళ్ల పదవీకాలం ఉండాలని సూచించింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉత్తర ప్రదేశ్ డీజీపీ ప్రకాశ్ సింగ్ పిటిషన్​లో ఆరోపించారు.

రెండేళ్ల పదవీకాలం మిగిలుండాలనే నిబంధన వల్ల నిజాయతీ గల సీనీయర్​ అధికారులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. పదోన్నతి పొందే అవకాశం లేకుండానే పదవీ విరమణ పొందాల్సి వస్తోందన్నారు. ఆ ఉత్తర్వులను మార్చాలని అభ్యర్థించారు.

ప్రకాశ్ సింగ్ వాదనను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టతనిచ్చింది. ఆరు నెలల పదవీకాలం మిగిలి ఉన్న అధికారులనూా డీజీపీ పదవికి ఎంపిక చేయవచ్చని వివరించింది.

ABOUT THE AUTHOR

...view details