తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీఛార్జ్​ - కరోనా వైరస్​ వార్తలు

లాక్​డౌన్​ పొడిగింపు నేపథ్యంలో ముంబయిలోని వలస కార్మికులు భారీ సంఖ్యలో ఒక్కసారిగా బాంద్రా ప్రాంతంలో గుమిగూడారు. తమను తమ స్వస్థలాలకు పంపేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని డిమాండ్​ చేశారు. వైరస్​ నేపథ్యంలో భౌతిక దూరం పాటించి తక్షణమే వెనుదిరగాలన్న పోలీసుల విజ్ఞప్తిని వారు వినలేదు. ఫలితంగా పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్​ చేశారు.

police-latthi-charged-migrant-workers-who-gathered-in-huge-numbers-in-mumbai
ముంబయి రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీ ఛార్జ్​

By

Published : Apr 14, 2020, 6:48 PM IST

Updated : Apr 14, 2020, 7:11 PM IST

ముంబయి రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీ ఛార్జ్​

కరోనా వైరస్​ భయం, మే 3 వరకు లాక్​డౌన్​ పొడిగింపు నేపథ్యంలో ముంబయిలోని వలస కార్మికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వేలాదిమంది కూలిలతో పశ్చిమ బాంద్రా ప్రాంతం కిక్కిరిసిపోయింది. భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘిస్తూ కూలీలు ఒక్కచోటే గుమిగూడారు. స్వస్థలాలకు వెళ్లెందుకు అనుమతినివ్వాలని.. అందుకోసం రవాణా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్​ చేశారు.

ఆ ప్రాంతం నుంచి తక్షణమే వెనుదిరగాలని పోలీసులు చెప్పినా కార్మికులు వినలేదు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు వలస కార్మికులపై లాఠీఛార్జ్​ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

ఆహారం ఉన్నా...

వలస కార్మికుల్లో అనేక మంది పాటిల్​ నాగ్రి ప్రాంతంలోని మురికివాడలో నివసిస్తున్నారు. అయితే.. స్వచ్ఛంద సంస్థల సహాయంతో ప్రభుత్వ యంత్రాంగం వీరందరికీ భోజన ఏర్పాట్లు చేస్తోంది. లాక్​డౌన్​ పొడిగింపు వార్తతో తాము అసంతృప్తిగా ఉన్నామని.. స్వస్థలాలకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నట్టు పేర్కొన్నారు.

'పరిస్థితి అదుపులోనే ఉంది...'

ఈ ఘటనపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ స్పందించారు. లాక్​డౌన్​ పొడిగింపు వార్తను.. సరిహద్దును తెరుస్తున్నట్టు అనుకుని కార్మికులు పొరబడి ఉండొచ్చని ఆయన​ అభిప్రాయపడ్డారు. వారందరికీ ఆహార ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

Last Updated : Apr 14, 2020, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details