దిల్లీ ట్రాక్టర్ ర్యాలీ హింసాకాండ జరిగిన ఒక రోజు అనంతరం దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓవైపు ఘర్షణలకు సంబంధించి పోలీసులు పెద్ద ఎత్తున ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా.. మరోవైపు ఈ పూర్తి వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇన్ని రోజులు ఐకమత్యంతో శాంతియుతంగా నిరసనలు చేపట్టిన రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఇప్పటికే రెండు రైతు సంఘాలు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి.
22 ఎఫ్ఐఆర్లు..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌లో హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు 22 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీటిల్లో రాకేశ్ టికాయత్, మేధా పాఠక్, బుటా సింగ్, యోగేంద్ర యాదవ్‌తో పాటు మొత్తం మీద 37మంది రైతు నేతల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:-పెళ్లి వేడుక కోసం వచ్చి.. హింసకు ఆ 'రైతు' బలి
ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 200మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రశ్నిస్తున్నారు. మరికొందరిని అరెస్ట్ చేసి.. వారినీ ప్రశ్నించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
పోలీసు నుంచి టియర్ గ్యాస్ తుపాకీని లాక్కున్న రైతు దిల్లీ హింసతో సంబంధం ఉన్న 550 ఖాతాలను సస్పెండ్ చేస్తున్నట్టు సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ బుధవారం ప్రకటించింది. తమ పాలసీని ఉల్లంఘించిన ట్వీట్లను లేబుల్ చేసినట్టు పేర్కొంది.
గణతంత్ర పరేడ్‌లో అలజడులపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హింసకు కారణమైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.
అల్లర్లలో ఎర్రకోట వద్ద విధ్వంసం షా సమీక్ష..
హింసాత్మక ఘటనలపై బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. షా నివాసంలో జరిగిన భేటీకి ఉన్నతాధికారులు హాజరై.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందించారు. ఘర్షణలపై ఒక రోజు వ్యవధిలో షా సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి.
ఈ నేపథ్యంలో దిల్లీలో అదనపు బలగాల కేటాయింపుతో పాటు.. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాలపై దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు సమాచారం.
రైతు సంఘాల్లో చీలిక!
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక ఘటనలు.. 58రోజులుగా శాంతియుతంగా సాగిస్తున్న రైతుల పోరాటంపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఘర్షణల అనంతరం రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు రెండు( భారతీయ కిసాన్ యూనియన్(భాను), రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్) సంఘాలు ప్రకటించాయి.
ఇదీ చూడండి:-'ఇకనైనా సాగు చట్టాలను వెనక్కి తీసుకోండి'
ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం.. వేరేలా ఉందని, అలాంటప్పుడు ఉద్యమంలో కొనసాగలేమని ఆర్‌కేఎంఎస్ నాయకుడు వి.ఎం. సింగ్ వ్యాఖ్యానించారు.
ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ తెలపిన కొద్ది సేపటికే.. చిల్లా సరిహద్దులోని అనేక మంది రైతులు.. తమ టెంట్లను తొలగించారు.
ఘాజీపుర్ సరిహద్దు వద్ద పరిస్థితి పాదయాత్ర వాయిదా!
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న పార్లమెంటు వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించిన రైతు సంఘాల నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ట్రాక్టర్ ర్యాలీలో హింస దృష్ట్యా పాదయాత్ర వేయాలని భావిస్తున్నారు. ఈ అంశంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ నేత ఒకరు చెప్పారు.
దిల్లీ పరిస్థితి..
దేశ రాజధానిలో మంగళవారం ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో నిరసనలు బీభత్సం సృష్టించారు. నిర్దేశిత మార్గం, నిర్ణీత సమయం వంటి నిబంధనలు ఉల్లఘించి.. చెలరేగిపోయారు. ఎర్రకోటవైపు దూసుకెళ్లి ఓ మతానికి చెందిన జెండాను ఎగురవేశారు. ఐటీఓ వద్ద పోలీసులు- రైతులకు మధ్య చెలరేగిన ఘర్షణలో 6 బస్సులు, 5 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. మొత్తం మీద 300కుపైగా మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుళ్లు ఇంతటి విధ్వసంకర గణతంత్ర పరేడ్ ముగిసి ఒక రోజు అయినప్పటికీ.. దిల్లీలో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. రైతులు ఉన్న సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది ప్రభుత్వం. మరోవైపు ట్రాఫిక్పైనా ఆంక్షలు విధించింది. లాల్ ఖిలాలో మెట్రో స్టేషన్‌ను మూసివేయగా.. పలు ప్రాంతాల్లో సేవలను నియంత్రించారు.
దిల్లీలో ట్రాఫిక్ ఇక్కట్లు ఇదీ చూడండి:-'దిల్లీ హింసకు దీప్ సిధు లాంటి విద్రోహ శక్తులే కారణం'