తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సినిమాను తలపించే పోలీసుల ఛేజ్​..ముగ్గురు సేఫ్​

లఖ్​నవూ-ఆగ్రా ఎక్స్​ప్రెస్​ మార్గంలో బైక్​పై వెళ్తున్న ముగ్గురిని పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు యూపీ పోలీసులు. 4 కిలోమీటర్లు వెంబడించి ద్విచక్ర వాహనం పేలిపోకుండా ఆపడంలో సఫలమయ్యారు. ఫలితంగా ఉన్నతాధికారులు, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

సినిమాను తలపించే పోలీసుల ఛేజ్​..ముగ్గురు సేఫ్​

By

Published : Apr 17, 2019, 10:54 PM IST

అది ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ- ఆగ్రా ఎక్స్​ప్రెస్​ వే. వేగంగా బండిపై భార్య, బిడ్డలతో కలిసి వెళ్తున్నాడొక వ్యక్తి. త్వరగా ఇంటికి చేరుకోవాలని మండుటెండలో అతివేగంతో దూసుకెళ్తున్నాడు. ద్విచక్రవాహనానికి తగిలించిన లగేజి(సామగ్రి) రోడ్డుకు తాకి మంటలు అంటుకున్నాయి. ఆ విషయం గమనించని బైకర్​ అలాగే ముందుకెళ్లాడు.

  • అదే సమయంలో రోజువారీ విధినిర్వహణలో భాగంగా ఆ మార్గంలో పెట్రోలింగ్​ నిర్వహిస్తుంది ఇటావా పీసీఆర్​ యూపీ100 పోలీసు బృందం. మంటలు అంటుకున్న బైక్​ రహదారిపై దూసుకెళ్తుండటం గమనించారు. ఇంకేముంది సినిమా రేంజ్​లో వారిని వెంబడించారు.
  • చివరికి 4 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆ బైకర్​ను అందుకోగలిగారు. అగ్నికీలల నుంచి అప్రమత్తం చేసి వారి ప్రాణాలను రక్షించారు.​ మరికొంత దూరం అలాగే ప్రయాణిస్తే మంటలు పెట్రోలు పైపుకు అంటుకుని వాహనం పేలిపోయేదని ఇన్​స్పెక్టర్​​ ఆలోక్​కుమార్​ వెల్లడించారు.

పోలీసులు.. ఛేజ్​ చేసి ముగ్గురి ప్రాణాలను రక్షించినందుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. బృందంలోని ఒక్కొక్కరికి రివార్డు కింద 2 వేల రూపాయలు అందించారు యూపీ డీజీపీ ఓపీ సింగ్​. విక్రమ్​ సింగ్​, అమిత్​, ఓమ్​ సింగ్​ల పోలీసు కర్తవ్యాన్ని మెచ్చుకుంటూ వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

యూపీ పోలీసులు ఈ ఘటనకు చెందిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. ఇందులోని పోలీసుల తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

ABOUT THE AUTHOR

...view details