తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదులు అరెస్ట్​

గణతంత్ర దినోత్సవానికి ముందు భారీ పేలుడుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్​​ పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్​​ ఉగ్ర సంస్థకు చెందిన ఐదుగురు ముష్కరులను అరెస్ట్​ చేశారు.

JeM module in Srinagar
భారీ ఉగ్ర కుట్ర భగ్నం

By

Published : Jan 16, 2020, 6:28 PM IST

జైషే మహ్మద్​ ఉగ్రసంస్థపై కీలక విజయం సాధించారు జమ్ముకశ్మీర్​ పోలీసులు. గణతంత్ర వేడుకలకు ముందు శ్రీనగర్​లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుడుకు తీవ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు. జైషేకు చెందిన ఐదుగురు ముష్కరులను అరెస్ట్​ చేశారు.

ఉగ్రవాదుల స్థావరం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.

" జైషే మాడ్యూల్​ను ఛేదించి శ్రీనగర్ పోలీసులు భారీ​ విజయం సాధించారు. గణతంత్ర దినోత్సవానికి ముందు హజ్రత్​బల్​ ప్రాంతంలో రెండు భారీ గ్రెనేడ్​ దాడులు చేసేందుకు కుట్ర పన్నారు.​"

-పోలీసులు

అరెస్టయిన వారిని హజ్రత్​బల్​లోని సదర్బాల్​కు చెందిన అజిజ్​ అహ్మెద్​​ షేఖ్, నసీర్​ అహ్మెద్​ మిర్, అసార్​ కాలనీకి చెందిన ఉమర్​ హమీద్​ షేఖ్​, ఇంతియాజ్​ అహ్మెద్​ చిక్లా, సహిల్​ ఫరూక్​ గోజ్రీ​గా గుర్తించారు.

ఇదీ చూడండి: 'హిజ్బుల్' ఉగ్రమూకపై పోరులో కీలక విజయం

ABOUT THE AUTHOR

...view details