తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలుడు హెల్మెట్​ పెట్టుకోలేదని సైకిల్​ జప్తు - బాలుడు హెల్మెట్​ పెట్టుకోలేదని సైకిల్​ జప్తు

తమిళనాడులో మోటారు వాహనాల కొత్త చట్టాన్ని ఎంతో శ్రద్ధగా అమలు చేస్తున్నారు పోలీసులు. ధర్మపురి జిల్లా పెన్నగరమ్​లో సైకిల్​పై వెళుతుండగా హెల్మెట్​ పెట్టుకోలేదని పోలీసులు విద్యార్థిని ఆపారు. టైరులో గాలి తీసేసి సైకిల్​ను జప్తు చేశారు.

బాలుడు హెల్మెట్​ పెట్టుకోలేదని సైకిల్​ జప్తు

By

Published : Sep 18, 2019, 12:18 PM IST

Updated : Oct 1, 2019, 1:11 AM IST

కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహనాల కొత్త చట్టాన్ని తమిళనాడు పోలీసులు కఠినంగా అమలుచేస్తున్నారు. ఎంతలా అంటే సైకిల్​పై వెళుతున్న ఓ పాఠశాల విద్యార్థిని హెల్మెట్​ లేదని ఆపేసి అతని వాహనాన్ని జప్తు చేశారు​. ఈ ఘటన ధర్మపురి జిల్లాలోని పెన్నగరమ్​లో జరిగింది.

పెన్నగరమ్​ ఠాణా పరిధిలో ఎస్​ఐ సుబ్రమణియన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ఆ వైపుగా సైకిల్​పై వెళుతున్న విద్యార్థిని ఆపారు ఎస్​ఐ. హెల్మెట్​ ఎందుకు ధరించలేదని విద్యార్థిని అడిగారు. అతనేమీ సమాధానం ఇవ్వకపోవటం వల్ల టైర్​ నుంచి గాలి తీసి సైకిల్​ జప్తు చేశారు.

బాలుడు హెల్మెట్​ పెట్టుకోలేదని సైకిల్​ జప్తు

ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇదీ చూడండి: భారత్​ సైన్యం దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగులు

Last Updated : Oct 1, 2019, 1:11 AM IST

ABOUT THE AUTHOR

...view details