ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు సభ్యులను జమ్ముకశ్మీర్లోపోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ ఫొటో ఆధారంగా.. కుప్వారా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి సైనిక బలగాల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ముగ్గురు లష్కరే తోయిబా తీవ్రవాదులు అరెస్టు - Lashkar-e-Taiba
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో కుప్వారా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి బలగాల సాయంతో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
లష్కరేతోయిబాకు చెందిన ముగ్గురు సభ్యులు అరెస్టు
ఇంతకీ ఆ ఫొటోలో ఏముంది...
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలో ముగ్గురు వ్యక్తులు ఆయుధాలు పట్టుకొని తాము ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకున్నామని తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు కుప్వారా ఎస్ఎస్పీ ఏఎస్ దినకర్ తెలిపారు. ఈ క్రమంలోనే సమాచారాన్ని సేకరించి.. వారి కదలికలను గుర్తించినట్లు వివరించారు. అనంతరం కుప్వారాలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.