తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.24.77 కోట్ల విలువైన ఛోక్సీ ఆస్తుల జప్తు - ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు మెహుల్​ ఛోక్సీకి చెందిన సుమారు రూ.24.77 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది​ ఈడీ. భారత్​తో పాటు దుబాయిలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

రూ.24.77 కోట్ల విలువైన ఛోక్సీ ఆస్తుల జప్తు

By

Published : Jul 11, 2019, 10:56 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం చేసినఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ)...పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్​ ఛోక్సీకి మరోమారు షాకిచ్చింది. భారత్​తో పాటు విదేశాల్లోని సుమారు రూ.24.77 కోట్ల విలువైన చోక్సీ ఆస్తులను జప్తు చేసింది.

దుబాయిలో వ్యాపార సంబంధమైన మూడు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అందులో మెర్సిడీస్​ బెంజ్​ కారు, దేశ విదేశాల్లోని వివిధ బ్యాంకుల ఖాతాల్లో ఫిక్స్​డ్​ డిపాజిట్లు ఉన్నాయి. అక్రమ నగదు బదిలీ నివారణ చట్టం కింద చర్యలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. ఈ కుంభకోణంలో ఛోక్సీ మొత్తం భాగం రూ.6,097.73 కోట్లుగా పేర్కొంది. ఇందులో ఇప్పటివరకు రూ.2,534.7 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది.

13 వేల కోట్ల పీఎన్​బీ కుంభకోణంలో మెహుల్​ ఛోక్సీ, నీరవ్​ మోదీ, ఇతరులపై దర్యాప్తు చేపడుతోంది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. 2018లో బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై సీబీఐతో పాటు ఈడీ ఎఫ్​ఐఆర్​ నమోదు చేశాయి.

ఇదీ చూడండి:వైరల్​: తుపాకీలో తూటాలు ఇలా నింపాలిరా చిన్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details