నరేంద్ర మోదీ ఓ నియంతల వ్యవహరిస్తున్నారని బఘేల్ ఆరోపించారు. మోదీ దేశానికి అసత్య వాగ్దానాలు చేశారని ఆయనపై పోటీ చేసేందుకు కాంగ్రెస్ తనకు అవకాశం ఇవ్వాలని కోరారు."నేను ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ టికెట్ ఇస్తే..మోదీని ఓడించి..రాహుల్‌ను తరువాతి ప్రధానిని చేస్తా" -నంద్ కుమార్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ సీఎం తండ్రి
మోదీపై పోటీకి ముఖ్యమంత్రి తండ్రి సై!
ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి తండ్రి నంద్ కుమార్ బఘేల్ తెలిపారు. మోదీని ఓడించి..రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని స్పష్టంచేశారు.
మోదీ, బఘేల్
ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకూడదని బఘేల్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే షరతు విధించాలని సూచించారు. ప్రస్తుతం బఘేల్ ఏ పార్టీలోనూ సభ్యుడిగా లేరు.