కరోనా కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదుతూ.. ఈ వారంలో రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ మోదీ చేసిన ప్రసంగం 193 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి మోదీ ప్రజలకు అందించిన సందేశాల్లో అత్యధిక నిమిషాల వీక్షణలు పొందిన ప్రసంగంగా ఇది నిలిచిందని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వెల్లడించింది.
మే 12న 33 నిమిషాల పాటు మాట్లాడారు మోదీ. గతంలో ప్రసంగించిన వీడియోను 203 మిలియన్ల మంది టీవీలో వీక్షించగా.. ఈ సారి ప్రేక్షకులు తగ్గారు. అయితే, నిమిషాల వ్యవధిలో చూస్తే.. అత్యధికంగా 4.3 బిలియన్ల నిమిషాల వీక్షణలతో తొలిస్థానంలో నిలిచింది. ఈ వారంలో మోదీ చేసిన ప్రసంగం 197 ఛానెల్లలో కనిపించగా.. గతంలో 199 ఛానెల్లలో ప్రసారమైంది.
టీవీ చూసే వారిలో క్రమంగా తగ్గుదల