తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని ప్రసంగానికి ముందు సర్వత్రా ఉత్కంఠ!

సార్వత్రిక ఎన్నికలకు రెండు వారాల ముందు ప్రధాని జాతినుద్దేశించి ముఖ్య సందేశమిస్తారని తెలియగానే దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరిగింది. మోదీ ఏం చెబుతారు? పాకిస్థాన్​తో యుద్ధం ప్రకటిస్తారా? నోట్ల రద్దు వంటి  సంచలన ప్రకటన ఏదైనా చేస్తారా? జైషే ఉగ్రసంస్థ అధినేత మసూద్​ను భారత్​కు రప్పిస్తున్నామని వెల్లడిస్తారా? మరో ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ఏమైనా ప్రకటిస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు జనం మదిలో మెదిలాయి.

ప్రధాని ప్రసంగం మొదలయ్యే ముందు సర్వత్రా ఉత్కంఠ!

By

Published : Mar 27, 2019, 7:53 PM IST

Updated : Mar 27, 2019, 8:25 PM IST

బుధవారం ఉదయంసమయం 11 గంటలు దాటింది. ముంబయి రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మొబైల్లో ట్విటర్ ఓపెన్ చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ముఖ్య సందేశమిస్తానన్న ట్వీట్ చూశాడు. మోదీ ఏం చెబుతారా అని దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో ఆసక్తికర చర్చ మొదలైంది. 2016లో ఇదే తరహాలో సందేశమిస్తానన్న మోదీ పెద్ద నోట్లు రద్దు చేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. మళ్లీ అలాంటిదేమైనా జరుగుతుందా అని ఉత్కంఠ నెలకొంది. షేర్​ మార్కెట్లలో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది.

తమిళనాడులో మీడియా హడావిడి

సమయం 11:30 గంటలు దాటింది మోదీ సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తమిళనాడులో టీవీ ఛానెళ్ల హడావిడి మొదలైంది. మోదీ ఏ విషయం గురించి మాట్లాడుతారా అని సీనియర్ జర్నలిస్టులపై ప్రశ్నల వర్షం కురిసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విధాన పరమైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని వారు తెలిపారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళని స్వామి, డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు.

సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ

సమయం 12 గంటలు దాటింది. మోదీ ఇంకా టీవీలో కనబడటం లేదు. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మోదీ ప్రస్తావించబోయే అంశాలపై ఛలోక్తులతో కూడిన ట్వీట్లు చేస్తూ జోరుగా చర్చించారు.

అప్పట్లో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించడానికి ముందు మీడియాతో మాట్లాడిన ఇందిరా గాంధీ ఫోటోలను షేర్ చేశారు.

'దావూద్ ఇబ్రహీంను అరెస్టు చేసి భారత్​కు రప్పిస్తున్నారా? హఫీజ్ సయీద్, మసూద్ అజర్​లలో ఎవరినైనా అంతమొందించారా?' అని ఓ యువకుడు ట్వీట్ చేశాడు.

'మోదీ జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు. నేను ఏటీఎం ముందు సిద్ధంగా ఉన్నా' అని మరో యువకుడు హాస్యాస్పద ట్వీట్ చేశాడు.

'మళ్లీ నోట్ల రద్దు ప్రకటిస్తారా? పాకిస్థాన్​పై యుద్ధం ప్రకటిస్తారా? చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా' - నెటిజన్ ట్వీట్

'మోదీ సందేశమిస్తానని ప్రకటించగానే పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కు రక్తపోటు పరీక్షలు నిర్వహించారు.'- నెటిజన్ ట్వీట్​.

సమయం మధ్యాహ్నం12:25గం. అయింది. అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ భారత శాస్త్రవేత్తలు అంతరిక్షంలో నిర్వహించిన 'మిషన్ శక్తి' ప్రయోగం విజయవంతమైందని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ భద్రతలో మరో మైలురాయి సాధించామని తెలిపారు.

Last Updated : Mar 27, 2019, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details