తెలంగాణ

telangana

కోల్​కతాలో మోదీ- నేతాజీ భవన్​ సందర్శన

By

Published : Jan 23, 2021, 5:02 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్​కతాలోని నేతాజీ భవన్​ను సందర్శించారు. సుభాష్​ చంద్రబోస్​ మనవళ్లు ఆయనకు స్వాగతం పలికి భవనం మొత్తాన్ని చూపించారు. అనంతరం నేషనల్​ లైబ్రరీకి వెళ్లిన మోదీ.. అక్కడి కళాకారులు, అధికారులతో సంభాషించారు. నేతాజీ 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ కోల్​కతాకు వెళ్లారు.

pm-visits-netajis-ancestral-home-in-kolkata
కోల్​కతాలో మోదీ- నేతాజీ భవన్​ సందర్శన

సుభాష్​ చంద్రబోస్​ 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కోల్​కతా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మెదీ.. నేతాజీ​ పూర్వీకుల నివాసం అయిన 'నేతాజీ భవన్'​ను సందర్శించారు ప్రధాని. స్థానికుల నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది. నేతాజీ మనవళ్లు కూడా మోదీకి స్వాగతం పలికి భవనం మొత్తాన్ని చూపించారు. ఈ క్రమంలో నేతాజీ వినియోగించిన కారు, ఆయన బెడ్​రూంలతో పాటు ఆజాద్​ హింద్​ ఫౌజ్​కు చెందిన మ్యూజియంను సందర్శించారు ప్రధాని.

నేతాజీ భవన్​లో ప్రధాని
కోల్​కతా విమానాశ్రయంలో మోదీ

మోదీ వెంటే బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​ కూడా ఉన్నారు.

ఆ తర్వాత నేషనల్​ లైబ్రరీకి వెళ్లారు. లైబ్రరీలోని విశేషాలను అధికారులు మోదీకి వివరించారు. అనంతరం అక్కడే.. కళాకారులు, ఇతర అధికారులతో సంభాషించారు మోదీ.

నేషనల్​ లైబ్రరీలోని కళాకారులతో మోదీ
నేషనల్​ లైబ్రరీలో

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details