కరోనాపై పోరుకు ప్రజలంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైరస్‌పై ప్రభుత్వ మార్గదర్శకాలు, సమాచారం కోసం ఉద్దేశించిన 'ఆరోగ్య సేతు' మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"సాంకేతికత ద్వారా ఈ యాప్ ప్రజలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. యాప్ వినియోగించే ప్రజలు పెరిగేకొద్దీ దాని సమర్థత పెరుగుతుంది."