ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 7న బెంగళూరుకు రానున్నారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రునిపై అడుగు పెట్టే సందర్భాన్ని ఆయన బెంగళూరులోని భూ నియంత్రక కేంద్రం నుంచి వీక్షిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టింది ఇస్రో.
ఈ నెల 21న చంద్రయాన్-2 చంద్రుడి కక్షలో ప్రవేశించింది. సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి.. 100X30 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అనంతరం సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగనుందని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తెలిపారు.