తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్వరలో థాయ్​లాండ్ పర్యటనకు మోదీ - pm modi latest news

ప్రధాని నరేంద్ర మోదీ... థాయ్​లాండ్​ పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. నవంబర్​ నెలలో థాయ్​లాండ్​లో జరగబోయే పలు సదస్సులకు మోదీ హాజరవుతారని తెలిపింది.

త్వరలో థాయ్​లాండ్ పర్యటనకు మోదీ

By

Published : Nov 1, 2019, 7:01 AM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌లాండ్‌ వెళ్లనున్నారు. నవంబర్‌ 2 నుంచి 4 వరకు థాయ్‌లాండ్‌లో జరిగే పలు సదస్సుల్లో మోదీ పాల్గొంటారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్‌ ఛాన్‌-ఒ-ఛా ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ బ్యాంకాక్‌ సందర్శించనున్నట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ ఠాకూర్​ సింగ్​ తెలిపారు.

పలు సదస్సులకు హాజరు

పర్యటనలో భాగంగా థాయ్​లాండ్​ జరిగే 16వ ఆసియాన్‌-ఇండియా సదస్సు, 14వ తూర్పు ఆసియా సదస్సు, 3వ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సదస్సుల్లో మోదీ పాల్గొంటారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి బ్యాంకాక్‌లో మంతనాలు జరుగుతున్నాయి. వాటిని సదస్సులో పాల్గొనే దేశాధినేతలు సమీక్షించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details