తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాజ్​పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ - నేడు యూపీలో ప్రధాని పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటించనున్నారు. మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా లఖ్​నవూలోని లోక్​ భవన్​లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్న వేళ ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

PM to unveil Vajpayee's statue in Lucknow on Wednesday
నేడు యూపీలో ప్రధాని పర్యటన

By

Published : Dec 25, 2019, 5:02 AM IST

Updated : Dec 25, 2019, 7:58 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో నేడు పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

వాజ్​పేయీ విగ్రహావిష్కరణ..

నేడు మాజీ ప్రధానమంత్రి అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా లఖ్​నవూలోని లోక్​ భవన్​లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోదీ. లఖ్​నవూ నుంచి వాజ్​పేయీ ఐదు సార్లు 1991,1996,1998, 1999, 2004లో లోక్​సభకు ప్రాతినిధ్యం వహించారు.

అనంతరం.. అటల్ బిహారి వాజ్​పేయీ వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు మోదీ. ఈ వర్సిటీకి యూపీ ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది.

కట్టుదిట్టమైన భద్రత..

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్​ప్రదేశ్​లో ఇటీవల ఆందోళనలు చెలరేగి హింసాత్మక ఘటనలకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. లఖ్​నవూవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో బలగాల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం

Last Updated : Dec 25, 2019, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details