తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంఎస్​పీపై రైతులకు మోదీ క్లారిటీ - ప్రధాని నరేంద్ర మోదీ

Prime Minister Narendra Modi will speak on benefits of agri laws during his virtual address to the farmers of Madhya Pradesh on Friday. The MP government has organised a state-level 'Kisan Kalyan' event in Raisen district.

PM Narendra Modi attends 'Kisan Kalyan' event in Raisen through video conferencing.
సాగు చట్టాల ప్రయోజనాలపై మోదీ ప్రసంగం

By

Published : Dec 18, 2020, 2:09 PM IST

Updated : Dec 18, 2020, 4:07 PM IST

14:56 December 18

తమ  ప్రభుత్వం ఎంఎస్​పీని తొలగించాలనుకుంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ఎందుకు అమలు చేస్తుందని ప్రశ్నించారు ప్రధాని మోదీ. తమ సర్కారు ఎంఎస్​పీ విషయంలో కచ్చితత్వంతో ఉన్నామన్నారు. అందకే ప్రతి ఏడాది సీజన్​ ముందే మద్ధతు ధరను ప్రకటిస్తున్నట్లు చెప్పారు.  

ఆందోళనలు చేస్తున్న పార్టీ నాయకత్వం ఎంత క్రూరమైనదో స్వామినాథన్ కమిషన్ నివేదికే అతిపెద్ద రుజువు అన్నారు ప్రధాని. గత ప్రభుత్వం స్వామినాథన్​ సిఫారసులను సమర్పించాక ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆ నివేదికలను చెత్తబుట్టలో వేసిందన్నారు. 

14:51 December 18

వారిని దేశం మరిచిపోదు: మోదీ

ఈ ఆందోళనలను ఇప్పుడు ప్రారంభించన వారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు మోదీ. ఈ రోజు వారు చేసిన పనులను దేశ ప్రజలు, రైతుల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అన్నారు.

14:46 December 18

రైతులను తప్పుదోవ పట్టించొద్దు:మోదీ

సాగు చట్టాల విషయంలో రైతులను తప్పుదోవ  పట్టించే ధోరణిని మానుకోవాలన్నారు ప్రధాని మోదీ. గత ఆరు, ఏడు నెలలుగా సాగు  చట్టాలు అమలువుతుంటే.. ఇప్పుడు ఆందోళనలు ఎందుకు  చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదంతా ఒక రాష్ట్రం నుంచే జరుగుతుందన్నారు. 

14:25 December 18

రైతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. రైతులను తప్పుదోవ పట్టించవద్దని విపక్షాలకు చేతులు జోడించి అభ్యర్థించారు. 

రైతుల సౌలభ్యం, పురోగతి, మెరుగైన ఆధునిక వ్యవసాయం కోసమే చట్టాలను తీసుకొచ్చినట్లు వ్యాఖ్యానించారు. 

14:19 December 18

వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించడాన్ని మానుకోవాలని హితవు పలికారు. 

ఆ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకొచ్చినవి కాదని, 20-30 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని గుర్తు చేశారు. 

వ్యవసాయ రంగ నిపుణులు, ఆర్థిక వేత్తలు, రైతు సంఘాలు ఎన్నో ఏళ్లుగా సంస్కరణలు కోరుకుంటున్నారని మోదీ అన్నారు. 

14:13 December 18

రైతులను ఉద్దేశించి మోదీ ప్రసంగం..

  • మధ్యప్రదేశ్‌లో కిసాన్‌ కల్యాణ్‌ పథకం ప్రారంభించిన ప్రధాని
  • రైతులను ఉద్ధేశించి వర్చువల్‌ విధానంలో ప్రధాని మోదీ ప్రసంగం
  • మధ్యప్రదేశ్‌లో 35 లక్షల మంది రైతులకు రూ.16వేల కోట్ల పరిహారం ఇచ్చాం
  • గిడ్డంగుల సదుపాయం రైతులకు అతి ముఖ్యమైనది: ప్రధాని మోదీ
  • రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది: ప్రధాని
  • గోదాముల సామర్థ్యం పెంచడంపై ఈ ప్రభుత్వం దృష్టి సారించింది: ప్రధాని మోదీ
  • రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాం: ప్రధాని మోదీ
  • రైతులను తప్పుదోవ పట్టించడాన్ని విపక్షాలు మానుకోవాలి: ప్రధాని

14:01 December 18

వ్యవసాయ చట్టాల ప్రయోజనాలపై ప్రధాని ప్రసంగం

సాగు చట్టాల ప్రయోజనాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు ప్రధాని. 

మధ్యప్రదేశల్​లో ఇవాళ.. 35 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 16 వేల కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలిపారు ప్రధాని. కిసాన్​ కల్యాణ్​ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఖరీఫ్​లో పంట నష్టపోయిన వారికి ఈ మొత్తం పరిహారం అందించింది శివరాజ్​సింగ్​ ప్రభుత్వం. 

Last Updated : Dec 18, 2020, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details